జాతీయ లోక్ అదాలత్ లో 714 కేసులు పరిష్కారం.

జహీరాబాద్ ఆగస్టు 13( జనంసాక్షి) మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో శనివారం  స్థానిక కోర్ట్ కాంప్లెక్స్ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ లో నియోజక వర్గంలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలు పాల్గొని వారి కేసుల పరిష్కారం కొరకు లోక్ అదాలత్ లో పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో సివిల్ విభాగంలో 2 కేసులు, క్రిమినల్ విభాగంలో 9 కేసులు, 64 బ్యాంకు పిఎల్సీ మరియు బి.ఎస్.యెన్.ఎల్  కేసులు, 1 ఎక్సయిజ్ కేసు పరిష్కరం 638 పెట్టి కేసులు అయినట్లు సివిల్ జడ్జి దుర్గా ప్రసాద్ తెలిపారు.. మొత్తంగా రూ. 7077938/- రూపాయలు వసూలు అయినట్లు అయన తెలియజేశారు.