Wednesday, 4 November 2026

జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 09(జనంసాక్షి) హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన జాతీయ సమైక్యత సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపు మేరకు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేస్తున్నట్లు తెలిపారు.శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ నుండి భారీ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.20వేల మంది జనసమీకరణ చేసి, ప్రజలను, యువతను,విద్యార్థులను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలనీ కోరారు.ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ప్రభుత్వం తరఫున భోజన వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు పాల్గొని జాతీయ సమైక్యతను చాటాలనీ ఆకాంక్షించారు.
2 Attachments • Scanned by Gmail