Thursday, 5 November 2026

జాతీయ సమ్మేళన్ కు తరలి వెళ్లిన ఏఐటీయూసీ నాయకులు

 

ఈ నెల30, 31వ తేదీల్లో మహారాష్ట్ర లోని నాగపూర్ లో జరగనున్న ఇండియన్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐటీయూసీ) 13వ జాతీయ సమ్మేళన్ కు సింగరేణి తరఫున దాదాపు 40 మంది ప్రతి నిధులు శుక్రవారం తరలి వెళ్లారు. ఈ మహా సభలో ఏఐటీయూసీ జాతీయ అధ్యక్షులు రమేంద్ర కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ పాల్గొన నున్నట్లు,అలాగే ఈ సమావేశాల్లో బొగ్గు పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వేజ్ బోర్డ్ లో నిర్ణయాలు, కాంట్రాక్టు కార్మికుల, విశ్రాంత కార్మికుల గురించి సుదీర్ఘంగా ఆలోచించి తీర్మానాలు చేస్తూ, నలభై నాలుగు కార్మిక చట్టాలను మార్చి నాలుగు కోడులు గా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ, కోయ గూడెం ఓపెన్ కాస్ట్ ను ప్రైవేట్ వ్యక్తులకు ధరా దత్తం చేయడం, సింగరేణి లో అండర్ గ్రౌండ్లో కాంట్రాక్టికరణకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యచరణ రూపొందించుకుంటామని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు.
ఈ మహా సభ కు తరలి వెళ్లిన వారి లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, వేజ్ బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు షేక్ బాజి సైదా, కె.వీరభద్రయ్య, మందమర్రి, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శులు సలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్, ఆర్.కె.పి ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య , మందమర్రి బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమానాథుని సుదర్శన్ తో పాటు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆళవందార్ వేణు మాధవ్ ఉన్నారని ఏఐటీయూసీ ఆర్.కె.పి బ్రాంచ్ కార్యదర్శి యం.డి అక్బర్ అలీ
తెలిపారు.