Tuesday, 3 November 2026

జిల్లాలో ఆలయాల మరమ్మతులకు రూ.1.48 కోట్లు మంజూరు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

  మేడ్చల్(జనంసాక్షి):   మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోని ఆలయాల మరమ్మతులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న 485 ఆలయాలకు రూ.1.48 కోట్ల 30 వేల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఈ నిధులతో ఆయా ఆలయాల్లో మరమ్మతులు చేసేందుకు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్లో ఆలయాలకు సంబంధించిన ఈ నిధులను ఆయా ఆలయ కమిటీ ఛైర్మన్లు, సభ్యులకు త్వరలోనే చెక్కుల ద్వారా  అందచేస్తామని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు.
Attachments area