జిల్లాలో వందలాది రైతన్నలకు నేటికీ అందని రుణమాఫీ
-రైతన్నల పరిస్థితి జిల్లాలో గందరగోళం.
-పట్టించుకోని అగ్రికల్చర్ జిల్లా అధికారులు.
-బహుజన సేన జిల్లా అధ్యక్షుడు దానయ్య.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 21 (జనం సాక్షి)ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ పై క్లారిటీ ఇవ్వని జిల్లా వ్యవసాయ అధికారులు. జిల్లాలోని వందలాది మంది రైతులకు నేటికీ రుణమాఫీ డబ్బులు అందక రైతన్నలు గందరగోలగా పరిస్థితుల్లో ఉన్నారని గురువారము బహుజన సేన గద్వాల జిల్లా అధ్యక్షుడు దానయ్య విలేఖరుల సమావేశంలో అన్నారు. జిల్లాలో రైతన్నలు అప్పుల బాధ తలక మరణించిన వారు చాలామంది ఉన్నారు వారి ఖాతాలో ఇప్పటికి డబ్బులు పడలేదని వారు ఆపోతున్నారు. ఈ విషయంపై వ్యవసాయ అధికారులు బ్యాంక్ అధికారులు రైతన్నలకు స్పష్టమైన మార్గదర్శకాలు తెలియజేయాలని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత శాఖ అధికారులకు గైడ్లైన్స్ ఇవ్వాలని వారు అన్నారు. రైతన్నలు దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టారు రైతన్నలు నేడు అడుగతిన పరిస్థితికి దిగజార్చున ప్రభుత్వం, బి ఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. గత గత ప్రభుత్వాల్లో రైతన్నకు అనేక సబ్సిడీలు ఉండేవని అన్నారు, లేదంటే వచ్చే ఎన్నికల్లో రైతన్నలు కన్నెర చేస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అన్నారు.




