తాండూరులో బీఆర్ఎస్ పార్టీ చేరికల ప్రభంజనం.
బీజేపీ నుంచి భారీగా బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో చేరికలు.
తాండూరు సెప్టెంబర్ 21(జనంసాక్షి)తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తాండూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి గులాబీ కండువాలు కప్పుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బషీరాబాద్ మండలం, బహదూర్పూర్ యువనేత శ్రీకాంత్ అధ్వర్యంలో బీజేపీ నుంచి దాదాపు 100 మంది యువకులను పార్టీలో చేరారు.వాళ్లం దరికీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మంత్రముగ్ధులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మన రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు.
బిఆర్ఎస్ లో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని సూచించారు.పార్థీలో చెరినవారు సాయి సంపత్, కావలి నరోత్తమ్, మెట్టు హనుమంతు, నవీన్, ప్రభాకర్, దేవర శ్రీనివాస్, ప్రదీప్, మహేష్, నవీన్, విక్రమ్ తో పాటు పలువురు యువకులు పార్టీలో చేరారు.




