జిల్లా కేంద్రానికి సినీ నటి కాజల్ రాక.

మాంగళ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించనున్న అందాలతార.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్22(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభానికి గురువారం అందాల తార, ప్రముఖ సీనినటి,మగధీర ఫేమ్ కాజల్ అగర్వాల్ వస్తుందని నిర్వాహకులు తెలిపారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవా నికి స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.