ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన బీసు చందర్ గౌడ్

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 22 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆత్మకూరు మండల అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ స్థానిక సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపూల ఐలయ్య కి 60000 రూపాయలు లోడి గోపాల్ కి 57000 రూపాయలు రేముడాల అమృత కి 60000 రూపాయల చెక్కులను వారికి అందజేశారు ఈ సందర్భంగా బీసు చందర్ గౌడ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి మనకి సంజీవని లెక్క అని అన్నారు ఆసుపత్రికి పోతే ఎంత బిల్ అయితదో అని ఒకప్పుడు టెన్షన్ పడేవాళ్ళం అని వచ్చిన రోగం పెద్దది కానీ జేబులో డబ్బులు లేవు పెద్ద ఆసుపత్రికి పోయి చూపించుకొనే స్తోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నిజంగా సంజీవినే అన్నారు ఎంత పెద్ద రోగం వచ్చిన ఈరోజు భయపడాల్సిన పనిలేదు అని సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ ప్రజల పాలిట దేవుడు అని అన్నారు బడుగు బలహీన వర్గాలకు బంగారు బాటలు వేస్తున్న ఏకైక నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని అన్నారు . మన ఆలేరు నియోజకవర్గంలో ఎంత మంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు వచ్చేటట్టు చేస్తున్నారు ఎవరు దవాఖానకు పోయి ఇబ్బంది పడొద్దు అని ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇప్పిస్తున్నారు ఈ సీఎం రీలిఫ్ ఫండ్ చెక్కుల విషయంలో ముఖ్యమంత్రి గారికి మనం రుణపడి ఉన్నామని అన్నారు సీఎం రీలిఫ్ ఫండ్ చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు ఐలయ్య గోపాల్ అమృత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి తెరాస మండల మాజీ అధ్యక్షులు కూరేళ్ల సర్పంచ్ బాషబోయిన ఉప్పలయ్య తెరాస మండల సెక్రెటరీ జనరల్ పంజాల వెంకన్న గౌడ్ ఆదర్శ నంది అవార్డు గ్రహీత మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ రైతు బంధు జిల్లా డైరెక్టర్ కోరే బిక్షపతి తెరాస మండల ఉపాధ్యక్షురాలు నాయిని శశికళ రెడ్డి తెరాస గ్రామశాఖ అధ్యక్షులు సామ నరేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మేడి లక్ష్మీ రామలక్ష్మయ్య ప్రాథమిక పాఠశాల చైర్మన్ నిమ్మరెడ్డి నరేందర్ రెడ్డి తెరాస మండల కోశాధికారి ఏనుగు మధుసూదన్ రెడ్డి తెరాస బీసీ సెల్ నాయకులు ముద్దసాని వెంకటేష్ గౌడ్ తెరాస ఆలేరు నియోజకవర్గ యువజన నాయకులు వస్తుపూల నరేష్ తెరాస మైనార్టీ సెల్ మండల మాజీ అధ్యక్షులు ఎస్కె రహీం తెరాస నాయకులు పెసరకాయల నర్సింహారెడ్డి మల్లయ్య యాదవ్ ఐలయ్య యాదవ్ యాదయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.