జిల్లా హాస్పిటల్లో 550 బెడ్ లకు టెండర్లు పిలవాలి

కార్మికుల పొట్ట కొడుతున్న రాష్ట్ర వైద్య అధికారులు*
 కార్మికులకు వేతనాల పెంచాలి*
నల్గొండ బ్యూరో.జనం సాక్షి
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్ కేర్ ,శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ లకు కొత్త టెండర్లు 550 పడకలకు  పిలవాలని *ఏఐటియుసి మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్ర హాస్పిటల్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ టెండర్ కాలపరమితి ముగిసి రెండు సంవత్సరాల దాటుతున్న నేటికి కొత్త టెండర్లు పూర్తిచేయాకుండ కాలయాపన చేయడం విచారకరమనీ అన్నారు.  నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో  550 పడకలు ఉన్న జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పడకల సంఖ్య నిర్ధారించడంలో రాష్ట్రవైద్య అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు 400 బెడ్ లకు టెండర్లు పిలవడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. జిల్లా ఆసుపత్రి లో దాదాపు 600 మంది పైగా రోగులు చికిస్త పొందుతారని అలాంటిది 400 బెడ్ లకు టెండర్లు పిలిచి కార్మికుల పొట్ట కొట్టే ప్రయత్నం రాష్ట్ర వైద్య అధికారులు చేస్తున్నారని దేవేందర్ రెడ్డి ఆరోపించారు.సంవత్సరాల తరబడి కాలపరిమితి ముగిసిన పాత టెండర్లనే కొనసాగించడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే కార్మికులకు ఇస్తున్న జీతాలు ఏమాత్రం సరిపోవటం లేదని పేర్కొన్నారు. జిల్లాలోని మిగతా ఆసుపత్రిలో టెండర్లు వేసినప్పటికీ వాటిని పూర్తి చేసి కొత్త వేతనాలు ఇవ్వడంలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని ఆరోపించారు. జీవో నెంబర్ 21 అమలు చేసి పంతొమ్మిది వేల రూపాయల వేతనం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 550  బెడ్ లకు టెండర్లు వెంటనే వేయకపోతే ఏఐటీయూసీ  ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని దేవేందర్ రెడ్డి తెలిపారు.  కార్మికులకు చట్టపరంగా రావలసినటువంటి పీఫ్ ,  ఈఎస్ఐ ,ప్రభుత్వ సెలవులు కచ్చితంగా అమలు చేయాలని ఆయన కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు యాదగిరి , లింగాస్వామి,ఎల్లమ్మ , పద్మ,సీ హెచ్ .నిర్మల, గంగాభవాని, మల్లిక,కవిత, మౌలాబి, జయమ్మ , శ్యామల,బాగ్యమ్మ, పార్వతమ్మ, విజయ,నాగమణి, ఉషమ్మా,యాదమ్మ,, రజియా, జాన్ బి, అండాలు, సరిత, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు