జి జే ఆర్ కప్ గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు పంపిణీ

*పెన్ పహాడ్ జూలై 23 (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల మొదటి వారంలో గ్రామస్థాయిలో నిర్వహించిన జిజేఆర్ కప్ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు మంత్రి సహకారంతో అందించిన బహుమతులను వివిధ గ్రామాల్లో క్రీడాకారులకు శనివారం పంపిణీ చేశారు, ఈ సందర్భంగా మండల పరిధిలోని అన్నారం బ్రిడ్జి గ్రామంలో సర్పంచ్ మీసాల రమణ దేవయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మీసాల లింగయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యగ్గడి మనోహర్, మాజీ సర్పంచ్ మీసాల లచ్చయ్య, నారాయణ గూడెం గ్రామంలో సర్పంచ్ మండలి మల్లయ్య, పిఎసిఎస్ చైర్మన్ నాా తల జానకి రామ్ రెడ్డి, మామిడి నాగయ్య,  గ్రామస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి జగదీశ్ రెడ్డి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే మంచి నడవడిక కలిగిన వ్యక్తిని అందుకే ఒక్కడే పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించకుండా తన పుట్టినరోజు సందర్భంగా అన్ని గ్రామాల్లో క్రీడాకారులకు ఉత్సాహం నింపేందుకు గ్రామం నుండి నియోజకవర్గ స్థాయి వరకు వివిధ రకాల క్రీడలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు తన సొంత నిధుల నుండి బహుమతులను అందించారని అన్నారు, ఈ బహుమతులను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని రానున్న ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి లాంటి మంచి వ్యక్తినే మరలా ఎన్నుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లోని నాయకులు, యాగ్గడి రంగయ్య, ముదిగొండ వీరస్వామి, మీసాల యాకోబు, మేకపోతుల శ్రవణ్, మామిడి శోభన్, అంజయ్య, బక్కయ్య, నిమ్మల ప్రవీణ్, అనిత, ప్రజా ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు…