జీడిమెట్ల: హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో ప్రమాదవశాత్తు ఓ కెమికల్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన జీడిమెట్లలోని పారిశ్రామిక వాడలో జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూనే ఉన్నాయి.
విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు ఎగిసి పడుతుండటంతో ఆస్తినష్టం అంచనా వేయలేకుండా ఉన్నారు. విషయం తెలిసిన పోలీసులు, రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.




