Wednesday, 4 November 2026

జీవ వైవిధ్య సదస్సుకు నిరసనగా 16న ర్యాలీ

హైదరాబాద్‌: పెట్టుబడిదారుల స్వార్థమే జీవవైవిధ్య విధ్యంసానికి కారణం కాబట్టి ఈ సదస్సుకు వ్యతిరేకంగా ఈ నెల 16న ర్యాలీ నిర్వహిస్తున్నాట్లు తెలంగాణ యూనిటైడ్‌ ఫ్రంట్‌ తెలిపింది. తెలంగాణ కోసం పోరాడే పార్టీలకు జాతీయ స్థాయిలో సహకారం కావాలని, అందుకే తెలంగాణకు అనుకూల వైఖరితో ఉన్న ఆర్‌ఎల్‌డీ  పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. రాష్ట్రంలో సమైఖ్యవాద పార్టీలను  ఎదుర్కోవడం ఒక్క తెరాస వల్ల కాదని, దీనికి జాతీయ స్థాయి పార్టీల మద్దతు అవసరమని తెలంగాణ యూనిటైడ్‌ ఫ్రంట్‌ నేత ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ అన్నారు.  గత పదకొండేళ్లుగా  ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈ ప్రాంతంలో అనేక చోట్ట పట్టు సాధించలేదని దిలీప్‌ చెప్పారు. యూపీఏ భాగస్వామిగా ఉంటూనే తెలంగాణకు మద్దతుగా మాట్లాడుతున్న అజిత్‌సింగ్‌ అభినందనీయుడని దిలీప్‌కుమార్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *