హైదరాబాద్ (జనంసాక్షి) : జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్ఎస్ దే విజయమన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. గులాబీ పార్టీ అన్నింటికి అన్ని డివిజన్లు గెలుచుకొని, గ్రేటర్ లో తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ డివిజన్ లో యువకులు పెద్ద సంఖ్యలో గులాబీ పార్టీలో చేరారు. మంత్రి మహేందర్ రెడ్డి వారందరికీ గులాబీ కండువాలు కప్పి.. పార్టీలోకి స్వాగతించారు. జిల్లాలో టీఆర్ఎస్ రోజురోజుకూ పటిష్టంగా తయారవుతోందని మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు




