జెండా ఆవిష్కరించిన ఆర్.కృష్ణయ్య

 జనంసాక్షి, మంథని : అట్టడుగు వర్గాల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా అందరినీ ఏకం చేసి రాజ్యాధికారం వైపు నడిపించడానికి ఏర్పాటు చేసిన బహుజన ఐక్య సంగం (బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక) జెండాను, కరపత్రాన్ని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ముదిరాజ్ సంఘాల జాతీయ నాయకులు అంబర్పేట్ శంకర్ ముదిరాజ్ ని కూడా కలవడం జరిగిందని వారు సైతం తన పూర్తి మద్దతును ప్రకటిస్తూ ఆశీర్వదించడం జరిగిందని ఈ కార్యక్రమంలో బహుజన ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపెల్లి రాజు సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు బొమ్మగాని అనిల్, ప్రధాన కార్యదర్శి కొండ రవీందర్, ట్రెజరీ ఐట్ల పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు