Wednesday, 4 November 2026

జైల్లో నింధితుడు మృతి

పరిగి రూరల్, సెప్టెంబర్ 9( జనం సాక్షి)
పరిగి సబ్ జైల్ లో శుక్రవారం ఓ ఖైదీ( నింధితుడు) మృతి చెందాడు. జైల్ సూపరింటెండెంట్ సీహెచ్ రాజు, పరిగి ఎస్ఐ పి.విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ లోని గాంధీనగర్ కు చెందిన తిరుమలపుడి రమేష్ బాబు ఎలక్ట్రి షన్ పనిచేస్తున్నాడు.  పూడూరు మండలం చన్గొముల్ పోలీస్ స్టేషన్ లోని 2020 సంవత్సరంలో ఓ కేసులో పరిగి సబ్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. ఇతనికి కొంతకాలంగా హెర్నియాతో బాధ పడుతున్నాడు. చికిత్స నిమిత్తం కొద్ది రోజుల క్రితం చర్లపల్లి జైల్ కు పంపించి తిరిగి పరిగి జైల్ కు తీసుకువచ్చారు. పరిగి జైల్ లో తన గదిలో గురువారం రాత్రి పడుకొని శుక్రవారం ఉదయం లేపే ప్రయత్నం చేయగా సృహలేనట్లుగా ఉన్నాడు. వెంటనే జైల్ సిబ్బంది తిరుమలపుడి రమేష్ బాబును పరిగి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పి.విఠల్ రెడ్డి తెలిపాడు.
ఫోటో రైటప్ :
09 పిఆర్ జి 05 మృతి చెందిన తిరుమలపుడి రమేష్ బాబు