జై భీమ్.. జై తెలంగాణ.. జై కేసీఆర్..!
సైదాపూర్ జనం సాక్షి సెప్టెంబర్ 16(లస్మన్నపల్లి)
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ సచివాలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాని హర్షిస్తూ మండలంలోని లస్మన్నపల్లి గ్రామస్తులు కేసీఆర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జై భీమ్.. జై తెలంగాణ.. జై కేసీఆర్ ..అనే నినాదాలు చేశారు. అనంతరం సర్పంచ్ కాయిత రాములు మాట్లాడుతూ… భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును తెలంగాణ సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేయడం ఎంతో చారిత్రాత్మకం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పట్ల తన ప్రేమ మాటలు కాదు చేతలని ఈ విధంగా నిరూపించాడని తెలిపారు. కుల, వర్గ, లింగ బేధాలు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్నాడని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటుకు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో వారీ వైఖరి ప్రకటించాలని అయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మ్యాకల మల్లారెడ్డి, వార్డు సభ్యులు రేగుల సురేష్, మాతంగి వెంకటయ్య, కోఆప్షన్ సభ్యులు కొట్టే వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాంపల్లి భూపతి, తిప్ప బత్తిని శ్రీనివాస్, మ్యాకల రాజిరెడ్డి, మోల్గూరి కొమురయ్య,పాల్సని రాంరెడ్డి, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.