దసరా నుంచి స్థలం ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేస్తాం
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి
నర్సాపూర్. సెప్టెంబర్, 16, ( జనం సాక్షి ) : దసరా నుంచి స్థలం ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు నర్సాపూర్ పట్టణంలో జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాలను ఘనంగా జరిపారు. పట్టణంలో రాష్ర్ట మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి నిర్వహించిన జాతీయ సమైఖ్యత ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనుల పొరాట ఫలితంగా నైజాం రాజరిక పాలన నుంచి విముక్తి లభించిందని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పండుగల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం రాష్ర్ట మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి మాట్లాడుతూ రాష్ర్టంలో సీఎం కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ర్టంలో కూడా అమలు కావడంలేదని తెలిపారు.జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి గ్రామంలో జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ లేబర్ వెల్పేర్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్‌గౌడ్, జడ్పిటీసీ మేఘమాల , ఆర్డివో ఉపేందర్‌రెడ్డి, కమిషనర్ చాముండేశ్వరీ, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నహీం, ఎంపీపీ జ్యోతి, మండల పార్టీ అధ్యక్షులు శేఖర్, టీఆర్ ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్‌గుప్త, తదితరులు పాల్గొన్నారు.
======================
ఫోటోరైటప్, ఎన్ ఎస్ పి 1 నర్సాపూర్ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
ఫోటోరైటప్, ఎన్ ఎస్ పి 2 నర్సాపూర్ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ర్ట మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డి