జోగిపేటలో నిమజ్జనం రోజున 25వేల నగదు ఇస్తా

17వ వార్డు కౌన్సిలర్‌ చిట్టిబాబు
జనం సాక్షిజోగిపేట ఆందోల్ బుధవారంపట్టణంలో వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా, శాంతి యుతంగా నిర్వహించుకునేందుకు మండప నిర్వాహకులు సహకరించాలని 17వ వార్డు కౌన్సిలర్‌ చిట్టిబాబు కోరారు. మంగళవారం శ్రీరామ ఫంక్షన్‌ హాలులో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పీస్‌ కమిటీ సమావేశం సీఐ నాగరాజు,ఎస్‌ఐ సామ్యానాయక్‌ల ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా రవీంద్రరెడ్డి హజరైనారు. ఈ సందర్బంగా చిట్టిబాబు మాట్లాడుతూ భక్తి శ్రద్దలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించే వినాయక మండపాలకు మొదటి బహుమతి కింద రూ.15వేలు, 2వ బహుమతి కింద రూ.10వేలు మొత్తం రూ.25వేలు అందజేస్తానని ప్రకటించారు. జోగిపేటలో హిందూ, ముస్లీం మద్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, ఎప్పటికి ఉంటాయని, తనకు చిన్నప్పటి నుంచి ముస్లీంలే నా స్నేహితులు ఎక్కువగా ఉన్నారన్నారు. మండపాల వద్ద నిర్వాహకులు ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడకూడదన్నారు. నిర్వాహకులు నవరాత్రోత్సవాలను ఘ