అందోల్ లో మంగళవారం నిర్వహించిన ఆషాడ మాస భోనాల ఉత్సవాల్లో అందోల్ ఎమ్మెల్యే చంటి చంటి క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. అందోల్, అందోల్ గూడెం లలో మహంకాళి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళల బోనాల ఊరేగింపుల్లో పాల్గొన్నారు. ఆయన వెంట జోగిపేట రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు మఠం బిక్షపతి, కౌన్సిలర్లు భవాని నాగరత్నం గౌడ్, ప్రవీణ సంతోష్, టిఆర్ఎస్ నాయకులు లింగ గౌడ్, సత్యం, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా పట్టణంలోని తూర్పు గౌని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ దేవాలయానికి బోనాల ఊరేగింపు నిర్వహించారు.




