Wednesday, 4 November 2026

జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న కార్మికులకు నాలుగు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలి

సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు

జనం సాక్షి జోగుపేట్ ఆందోల్ జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని. హాస్పిటల్ దగ్గర ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లిస్తామని హాస్పటల్ సూపర్డెంట్ హామీతో ఆందోళన విరమించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కష్ట కాలంలో కరోనా కష్ట కాలంలో కార్మికులంతా ఉద్యమించి సిఐటి ఆధ్వర్యంలో పోరాటం చేసి జీవో నెంబర్ 60 సాధించిన ఎందుకు అమలు చేయడం లేదని జీవో నెంబర్ 60 ప్రకారం ప్రతి కార్మికునికి 15,600 ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ హాస్పిటల్ లో నాలుగు నెలల నుండి బకాయింది చెల్లించని కాంట్రాక్ట్ పై క్రిమినల్ కేసులు పెట్టి కార్మికులకు న్యాయం చేయాలని బకాయిలు చెల్లించకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం దిక్కు లేదని అతి తక్కువ వేతనం కూడా నాలుగు నెలల నుండి పెండింగ్ ఉంటే కార్మికులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు వెంటనే నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని లేనిచోద్యమం ఉదృతం తప్పదని హెచ్చరించారు. పోరాటాల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని తమ సమస్యలు పరిష్కారం కోసం హక్కుల కోసం భవిష్యత్తులో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.. అనంతరం సూపర్డెంట్ ఆదేశాలకు డాక్టర్ శంకర్ గారు కార్మికుల దగ్గరికి వచ్చి జీవో 60 ప్రకారం 15,600 రూపాయలు చెల్లిస్తామని బకాయి వేతనాలు కాంట్రాక్టు మాట్లాడి ఇప్పించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన వివరించారు.. కార్యక్రమంలో సిఐటియు నాయకులు విద్యాసాగర్ కార్మికులు మల్లేశం భీమ్రావు జయమ్మ లక్ష్మి శ్రీహరి మల్లేశం శ్రావణ్ హరి శ్రీశైలం రవి శేఖర్ కార్మికులు పాల్గొన్నారు