జోరుగా సాగిన ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర…
ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 21 ,(జనం సాక్షి )జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో
ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీ జోరుగా సాగింది.బుధవారం ఉదయం 8 గంటలకు గోధుర్ వెంకటేశ్వర స్వామి మందిరం లొ పూజలు నిర్వహించి , అనంతరం తిమ్మాపూర్ తాండ , ఫకీర్ కొండాపూర్ , యామపూర్ వేములకుర్తి , బర్దిపూర్ , మూలరాంపూర్ , ఎర్ధండి
కోజాన్ కొత్తూరు , కేశపూర్
కోమటి కొండాపూర్ , వర్షకొండ , డబ్బా , ఎర్రపూర్ ,తాండ అమ్మక్కపేట ,చివరగా ఇబ్రహీంపట్నం చేరుకున్నారు . ఈ సందర్భంగా పలు గ్రామాల్లో బిజెపి ముఖ్య నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని , ఇబ్బందుల గురించి ప్రజలకు భరోసా కల్పించడానికి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజా గోస బిజెపి భరో బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టామని , రానున్న కాలంలో బండి సంజయ్ సారధ్యంలో తెలంగాణలో కాశాయ జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ , ఉపాధ్యక్షులు బద్దం గంగారెడ్డి , నియోజకవర్గ ఇంచార్జీ జె.యన్ వెంకట్ ,సురభి నవీన్ కుమార్ , నిశాంత్ కార్తీకేయ ,ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు బట్టి జకరయ్య , నాయకులు తీగలా శ్రీధర్రెడ్డి , భత్తుల శ్రీనివాస్ , సంజీవ్ రెడ్డి , వివిధ గ్రామాల అధ్యక్షులు , ఉపాధ్యక్షులు , బూత్ అధ్యక్షులు , బూత్ కమిటీ సభ్యులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.