టాలీవుడ్‌ డైరెక్టర్‌తో శివ కార్తికేయన్‌ సినిమా

మరో టాలీవుడ్‌ డైరెక్టర్‌తో శివ కార్తికేయన్‌ సినిమా చేయబోతున్నట్టుగా ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్‌ హీరోలు రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌ , అజిత్‌ , విజయ్‌ , సూర్య , కార్తి , ధనుష్‌ ల రూట్‌లోనే శివ కార్తికేయన్‌ కూడా తాను నటించిన సినిమాలను తెలుగులోనూ అనువాదం చేసి ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ’జాతిరత్నాలు’ ఫేమ్‌ కెవీ అనుదీప్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అయితే, శివ కార్తికేయన్‌ మరో తెలుగు సినిమాలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు ఇప్పుడు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకి ’సోగ్గాడే చిన్ని నాయన’, ’బంగార్రాజు’ సినిమాలతో హిట్స్‌ అందుకున్న టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను కోలీవుడ్‌ అగ్ర నిర్మాత కే.ఇ. జ్ఞాన్‌ వేల్‌ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి గాను శివ కార్తికేయన్‌ ఏకంగా 20 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రాజెక్ట్‌ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ఈ మధ్య కాలంలో శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన ’డాక్టర్‌ జి’, ’డాన్‌’ చిత్రాలు మంచి సక్సెస్‌ సాధించాయి. ఇక తెలుగులో మొదటిసారి సినిమా చేస్తున్న ఈ కోలీవుడ్‌ హీరోకు ఎలాంటి సక్సెస్‌ దక్కుతుందో తెలియాలంటే మూవీ విడుదలయ్యేవరకు వెయిట్‌ చేయాలి.