టిఆర్ఎస్ పార్టీలో చేరిన యువ నాయకుడు సంగమేశ్వర్.
తాండూరు అగస్టు 29(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలందేవనూరు గ్రామానికి చెందిన యువ నాయకుడు సంగమేశ్వర్ భారతీ య జనతా పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో సోమవారం చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని జరుగు తుందని వెల్లడించారు.పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు.తెలంగా ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.