టిఆర్ఎస్ సంక్షేమ పథకాలే మునుగోడు అభ్యర్థిని గెలిపిస్తాయి
బచ్చన్నపేట సెప్టెంబర్ 8 (జనం సాక్షి):మునుగోడులో జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాల మేరకు రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండలం నుండి రెండు వాహనాలలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఇంకా వేలాది మంది జిల్లా నుండి మునుగోడు కు ముత్తిరెడ్డి సైన్యం కదిలి వెళ్లి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలే మునుగోడు లో టిఆర్ఎస్ అభ్యర్థిని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
భారీ మెజార్టీతో గెలిపిస్తాయని రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో జనగామ జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య ,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి, టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, కో ఆప్షన్ నెంబర్ షబ్బీర్ ,ఫిరోజ్, సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.