16 సీట్లతోనే మనకు వాయిస్
బిబిపాటిల్ గెలుపునకు కృషి చేద్దామన్న ఎమ్మెల్యేలు
సంగారెడ్డి,మార్చి28(జనంసాక్షి): టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. ఐదు సంవత్సరాలుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రావిూణ సంక్షేమంతో పాటు బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. గత ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సును మరిచాయన్నారు. దీంతో ఈ ప్రాంతం వెనుకబాటుకు గురయ్యిందన్నారు. గతంలో పాలించిన స్వర్గీయ బాగారెడ్డి, సురేశ్ శెట్కార్ ఈప్రాంతాన్ని అభివృద్ధి పర్చడంలో విఫలమయ్యారని అన్నారు. జాతీయ రహదారుల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దీంతో నిజాంపేట నుంచి నారాయణఖేడ్ విూదుగా బీదర్‌కు జాతీయ రహదారి మంజూరైందని తెలిపారు. బిచ్కుంద నుంచి కంగ్టి విూదుగా బీదర్‌కు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అన్ని రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. కేసీఆర్‌పై నమ్మకం ఉంచి ఇటీవల జరిగిన సాధరణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో మరోమారు గెలిపించారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మరోమారు నిలిపిందన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బీబీ పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో 16 టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుంటే కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఆందోల్‌లో వచ్చే నెల 3న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను జయప్రదం చేయాలని క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సభకు టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
పార్టమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ని భారీ మెజార్టీతో గెలింపించాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి బీబీ పాటిల్ విజయానికి కృషి చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమయం సవిూపిస్తుండడంతో నియోజకవర్గంలోని అన్ని మండలాల కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు చూపించిన స్ఫూర్తిని పార్లమెంట్ ఎన్నికల్లో సైతం చూపించాలన్నారు.




