Thursday, 5 November 2026

టిఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభకు వర్షం అడ్డంకి

స్థలం ఎంపిక..గుర్తింపులో ఆటంకాలు

రెండుమూడు రోజుల్లో స్పష్టత

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రసమితి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సదస్సుకు వర్షం అడ్డంకిగా మారింది. ఇప్పటికే స్థలాన్ని గుర్తించి ఏర్పాట్లు చేయాల్సి ఉన్న తరుణంలో వర్షాల కారణంగా ఆటంకాలు ఏర్పడ్డాయి. సెప్టెంబరు 2న నిర్వహిస్తామని కెసిఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో భారీ బహిరంగ సభ కోసం టీఆర్‌ఎస్‌ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ సభకు సుమారు 25 లక్షల మంది జన సవిూకరణను లక్ష్యంగా పెట్టుకొని పార్టీ వ్యూహకర్తలు పని ప్రారంభించారు. దేశంలోనే అత్యంత భారీఎత్తున సభ నిర్వహణ ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు సన్నాహంగా సెప్టెంబరు 2న ‘ప్రగతి నివేదన’ పేరిట హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు కొందరు నేతలకు దీని బాధ్యతను అప్పగించారు. పార్టీ అభ్యర్థుల పేర్లను కూడా వచ్చే నెలలోనే వెల్లడిస్తామని సిఎం కెసిఆర్‌ చెప్పారు. వివాదరహిత స్థానాలకు సంబంధించి కొందరు అభ్యర్థుల పేర్లను ‘ప్రగతి నివేదన’ సభ వేదికగా ప్రకటిస్తామని పార్టీ రాష్ట్ర కమిటీ భేటీలో అధినేత కేసీఆర్‌ సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు తమ పార్టీ పూరిస్తున్న శంఖారావంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఈ సభను పరిగణిస్తున్నాయి. ఇదో రకంగా ఎన్నికల శంఖరావంగా శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఈ దశలో వర్షాలు తెరిపిస్తే స్థలాన్ని ఖరారు చేసి తదుపరి కార్యక్రమానలు చేపట్టనున్నారు. ప్రధానంగా విశాలమైన స్థలం ఉండేలా చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. సభాస్థలి కోసం నగర శివారుల్లో మూడు ప్రాంతాలను పరిశీలించారు. . చివరికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ 1,500 ఎకరాలకు మించిన విస్తీర్ణంలో ఖాళీ స్థలం ఒకేచోట అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థలాన్ని చదును చేయటం, వేదిక నిర్మాణం, ఇతర ఏర్పాట్లకు వారం రోజుల వ్యవధి సరిపోతుందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. హైదరాబాద్‌కు, రవాణాపరంగా చుట్టుపక్కల జిల్లాలకు సవిూపంలో ఉండటం కూడా సభా స్థలిగా కొంగర కలాన్‌ ఎంపిక చేసినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. కొంగర కలాన్‌ సౌలభ్యాన్ని అధినేత కేసీఆర్‌కు నివేదించగా, దానిని సభాస్థలిగా ఎంపిక చేయటానికి ఆయన కూడా సానుకూలంగా ఉన్నారని తెలిసింది. సభా స్థలికి చుట్టుపక్కల ఉండే రంగారెడ్డి, నల్లగొండ, ఉమ్మడి జిల్లాల్లోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 30 వేల నుంచి 50 వేల వరకు జన సవిూకరణ చేపట్టాలని ఆదేశించింది. జన సవిూకరణ విషయంలోనూ టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు స్పష్టత ఇచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 20-25 వేలకు తక్కువ కాకుండా జన సవిూకరణ చేపట్టాలని నిర్దేశిరచింది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని, సభకు రెండు రోజుల ముందు జనసవిూకరణపై దృష్టి పెడితే చాలునని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జన సవిూకరణ పర్యవేక్షణ బాధ్యతలను ఎప్పటి మాదిరిగా జిల్లాలవారీగా మంత్రులు చూడాలని పార్టీ అధిష్ఠానం నిర్దేశించింది. ఒకటి రెండురోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకావం ఉంది.