Thursday, 5 November 2026

టిక్కెట్ల కేటాయింపులో స్థానిక నినాదం

 

ప్యారాచూట్‌ నేతలకు ఇవ్వొద్దన్న డిమాండ్‌

ఆదిలాబాద్‌లో నివురుగప్పిన అసమ్మతి

ఆదిలాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఆదిలాబాద్జిలలాలో ఖానాపూర్‌పై కాంగ్రెస్‌ నేతల ఆందోళన ఇప్పుడు పార్టీలో చేరిన రమేశ్‌ రాథోడ్‌కు ఎదురదెబ్బ కానుంది. ఆయనను కాదని స్థానకంగా ఉన్నవారికే టిక్కెట్లు ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేస్తున్నారు. ప్యారచూట్‌ నేతలకు టిక్కట్లు ఇవ్వవద్దన్న డిమాండ్‌ మేరకు ఆందోళనలు చేస్తున్నారు. ఆశావహులు ఆఖరి ప్రయత్నాలుగా అధినేతలపైన తీవ్ర ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఓ వైపు కొందరు నేతలను ప్రచారం చేసుకోమని అంతర్గతంగా సంకేతాలిచ్చినా.. అధికారిక ప్రకటన వచ్చేవరకు జాబితాలో తమ పేర్లు ఉంటాయో ఉండవో అనే ఆందోళన నెలకొంది. కాంగ్రెస్‌ నేతలు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అభ్యర్థుల పేర్లు బయటకు రావడంతో వాటిని ఆధారంగా చేసుకుని కొందరు నేతలు ఇప్పటికే అసమ్మతి సెగ గాంధీభవన్‌ వరకు తాకింది. టికెట్లు అధికారికంగా ప్రకటించకుండానే .. అసంతృప్తి మంటలు ఎగిసిపడుతుండటంతో అధిష్ఠానంలోనూ అయోమయం నెలకొంది. మరోవైపు టిక్కట్లను అధికారికంగా ప్రకటించాక అంతా సద్దుమణుగుతుందన్న ధీమాలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. రోజుకో రకంగా పరిణామాలు మారుతుండటంతో జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయో అన్న ఆందోళనలో ఆశావాహులు కొట్టుమిట్టాడుతున్నాయి. తెరాసలో రెండు నెలల క్రితమే అభ్యర్థులు ఖరారు కావడం.. ఎన్నికల ప్రచారంలో దూసుకపోతుండగా.. కాంగ్రెస్‌లో టికెట్ల వ్యవహారం కొలిక్కిరాకపోవడం ఆశావాహులు నిరాశకు గురవుతున్నారు. అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయనే ప్రచారం సాగుతున్నా.. ఎవరికి వారు టికెట్‌కోసం అధిష్ఠానం వద్ద తమ వాదనను వినిపిస్తున్నారు. టికెట్‌ రావడం లేదనే సమాచారం అందిన నేతలు ఆ పార్టీలో అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్‌లో అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించకపోవడం ఆ పార్టీ నేతలు అసహనానికి గురవుతున్నారు. కూటమిలో పొత్తులపై దాదాపు స్పష్టత వచ్చింది. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహాకూటమి సీట్ల సర్దుబాటు లెక్కలు దాదాపు కొలిక్కి వచ్చినట్లుగా భావిస్తున్నారు. బెల్లంపల్లి స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి దాదాపు ఖరారైనట్లే. తెజస ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనేది ఇంకా సరైన స్పష్టత రాలేదు. తమ పేర్లు జాబితాలో ఉన్నట్లు ధీమాతో ఉన్న నేతలు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. అధికారిక ప్రకటనకు ఇంకా సమయం ఉండటంతో జాబితాలో పేర్లు ఉండే విదంగా కొందరు నేతలు దిల్లీలో మకాం వేసారు.న్నికలు దగ్గరపడుతున్న సమయంలో పార్టీలో చేరిన కొత్తవాళ్లకు టికెట్లు ఇవ్వొద్దనే వాదను సీనియర్‌ నేతలు వినిపిస్తున్నారు. మరికొన్ని చోట్లా స్థానికులకు, మహిళలకు టికెట్లు ఇవ్వాలని డిమాండు వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో టికెట్‌ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగి తేలుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న తనకే టికెట్‌ ఇవ్వాలని మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి అధిష్ఠానం వద్ద తన వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. ఖానాపూర్‌ టికెట్‌ కొత్తగా చేరిన రమేశ్‌రాఠోడ్‌కు ఎలా ఇస్తారంటూ అక్కడి నేతలు రెండ్రోజుల పాటు గాంధీభవన్‌లో ఆందోళన చేసి ఇంకా టికెట్‌ ఎవరికీ ఇవ్వలేదనడంతో విరమించారు. బోథ్‌, సిర్పూర్‌, ముథోల్‌ నియోజవర్గాల్లోనూ పార్టీలో పనిచేస్తున్న సీనియర్లకే టికెట్లు ఇవ్వాలనే డిమాండు చేస్తున్నారు. చెన్నూరులో స్థానికులకు టికెట్‌ ఇవ్వాలని.. బెల్లంపల్లి టికెట్‌ సీపీఐకి కాకుండా కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించాలని అధిష్ఠానంపైన ఒత్తిడి పెంచారు.మంచిర్యాల టికెట్‌ తనకే ఇవ్వాలని అరవింద్‌రెడ్డి దిల్లీలో

గట్టిగా ప్రయత్నిస్తున్నారు.