Thursday, 5 November 2026

టిఫిన్‌ సరిగా లేన్నందుకు చితకబాదారు

చాదర్‌ఘాట్‌లో చిరు వ్యాపారుల దాష్టీకం

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన పరిధిలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. చిరు వ్యాపారులు ముగ్గురు యువకులపై దాడి చేసి చితకబాదారు. టిఫిన్‌ సరిగా లేదని అడిగితే కర్రలతో వ్యాపారులు దాడి చేశారు. నల్లగొండ క్రాస్‌ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాపారుల దాడిలో కర్మన్‌ఘాట్‌కు చెందిన యువకులు అశ్విన్‌, కిరణ్‌, మోహన్‌ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన యువకులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.