Thursday, 5 November 2026

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా శంభీపూర్ రాజు గురువారం ప్ర‌మాణ‌స్వీకారం

.హైద‌రాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా శంభీపూర్ రాజు గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.శంభీపూర్ రాజు చేత శాస‌న‌మండ‌లి ప్రొటెం చైర్మ‌న్ అమీనుల్ హ‌స‌న్ జాఫ్రీ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థ‌ల నుంచి శంభీపూర్ రాజు ఎమ్మెల్సీగా ఎన్నికైన విష‌యం తెలిసిందే. శంభీపూర్ రాజు ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మంలో మంత్రులు కేటీఆర్, మ‌హ‌ముద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, ప‌లువురు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు.