Tuesday, 3 November 2026

టీఆర్‌ఎస్‌ను రాజకీయశక్తిగా తీర్చిదిద్దుతాం: కడియం

హైదరాబాద్‌,(జనంసాక్షి):టీఆర్‌ఎస్‌ పార్టీని ఉద్యమపరంగానే కాకుండా బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామని ఆ పార్టీ నేత కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు, ఇనఛార్జీలతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ను రాజకీయశక్తిగా తీర్చి దిద్దేందుకు కృషఙ చేస్తామని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టామని తెలిపారు. ఈ నెల 26నుంచి 30 వరకుఅన్ని మండల కేంద్రాల్లో పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పార్టీలో బలోపేతం చేసేందుకు నియోజక వర్గాల్లో అన్ని స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు చర్చించేందుకు జూలై 3న మరోసారి భేటీ అవుతామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *