బషీర్‌బాగ్ ప్రత్యెక తెలంగాణ ఏర్పాటవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ కావూరి సాంబశివరావు సమైక్యాంధ్ర నినాదాన్ని తీసుకువస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అరోపించింది దీనిలో భాగంగానె డిల్లీలో ప్రధానమంత్రితో సహా యూపీఏ నేతలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబాట్టారు ఇలాంటి విధానాలు వీడ కుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీమాంధ్ర ఎంపీల వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌వీ నిజాం కళాశాల యూనిట్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ బాబు జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద ఎంపీ కావూరి సాంబశివరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కావూరికి వ్వతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం టీఆర్‌ఎస్‌వీ నేతలు కృష్ణ ప్రణీత్ శేఖర్ రాథోడ్ శశాంక్ తదితరులు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభవాలను కనీసం గౌరవిచకుండా చవకబారు విధానాలను వీడకుంటే సీమాంధ్ర ఎంపీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు




