Monday, 2 November 2026

టీచర్ తీరును నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన

దండేపల్లి : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలోని కస్తుర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంగ్లీష్ ఉపాధ్యాయిని తీరును నిరసిస్తూ విద్యార్థులు శనివారం నాడు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయిని తమను రోజూ హింసిస్తున్నారని, అసభ్యకరంగా మాట్లాడుతున్నరనీ విద్యార్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘ఉపాధ్యాయిని మాకొద్దు’ అంటూ పదో తరగతి విద్యార్థినులు శనివారం పాఠశాలలో నిరసనకు దిగారు.

మండల విద్యాధికారి(ఎంఈవో) హనుమంతరావు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయినితో మాట్లాడారు. అయితే, ప్రాజెక్టు విషయంలో పదో తరగతి విద్యార్థులను మందలించానే కానీ, వారిని తిట్టడం, కొట్టడం లాంటివి చేయలేదని ఆమె వివరణ ఇచ్చారు. చెప్పిన మాటలు వినని విద్యార్థినులు ఆందోళనకు దిగినట్టు ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *