Wednesday, 4 November 2026

టీజీని పిచ్చాసుపత్రిలో చేర్పించాలి

– కేశవరావును విమర్శించే స్థాయి టీజీకి లేదు
– టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌
హైదరాబాద్‌, జూన్‌23(జ‌నం సాక్షి) : ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కె కేశవరావుపై టీజీ వెంకటేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కర్నె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీ లాంటి వ్యక్తుల వల్ల ఆంధప్రదేశ్‌కే నష్టం అని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీజీని అదుపులో ఉంచాలని సూచించారు. టీజీ వెంకటేష్‌ అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని, అటువంటి పరిస్థితి రాకుండా ఉండేలా చూడాలంటూ చంద్రబాబును కోరారు. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడుతూ తెలంగాణ  ఉద్యమ చరిత్రను కించపరచొద్దంటూ హితవు పలికారు. ప్రజలను రెచ్చగొట్టడమే టీజీ పరమావధిగా పెట్టుకున్నారని కర్నె మండిపడ్డారు. ఏపీ ప్రత్యేక ¬దాకు తెరాస మద్దతుగా ఉందన్నారు. అందుకే పార్లమెంట్‌లో టీడీపీ నేతల ఆందోళనకు మద్దతు తెలిపిందన్నారు. టీజీ వెంకటేశ్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తాముకూడా అదే స్థాయిలో మాట్లాడటమని, దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతాయని అర్థం చేసుకొని మాట్లాడాలని సూచించారు. టీజీ వెంకటేష్‌ ఎప్పుడూ పదవుల కోసం తప్ప.. ప్రజల సుఖ సంతోషాల కోసం ఆలోచించరని కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. కేశవరావుకు పదవి ఇవ్వాలనే చర్చ పార్టీలో లేదని, ఒకవేళ వస్తే రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారని కర్నె ప్రభాకర్‌ పేర్కొన్నారు. మట్టిలో మాణిక్యాలైన కేటీఆర్‌, కవిత, హరీష్‌ రావును.. లోకేశ్‌తో పోల్చడమేంటని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ రాములు నాయక్‌ అన్నారు.