Wednesday, 4 November 2026

టీడీపీ అధినేత చంద్రబాబు ని కలిసిన ఎంపీటీసీ సంధాని

గుండాల,సెప్టెంబర్20(జనంసాక్షి);ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని ఆయన వ్యక్తిగత నివాసంలో గుండాల ఎంపీటీసీ,టీడీపీ మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే సంధాని కలిసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గ పరిస్థితులను చంద్రబాబు కి వివరించి కార్యకర్తలు బలంగా ఉన్న నియోజకవర్గ స్థాయిలో బలమైన నాయకులు లేకపోవడం వల్ల కార్యకర్తలు పడే ఇబ్బందులను తెలియజేశారు.అలాగే పినపాక నియోజకవర్గంలో టీడీపీ పోటీ విషయమై పలు నాయకుల పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తుంది.