Tuesday, 3 November 2026

టీడీపీ నేతలు కెఇ వ్యాఖ్యలపై గట్టు మండిపాటు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ నేత కెఇ కృష్ణమూర్తి వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌ సీపీ నేత గట్టు రామచంద్ర రావు మండిపడ్డారు. టీడీపీ నేతలు తీవ్రవత్తిడికి లోనై అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సంతాప సభలా మార్చారని విమర్శించారు. చంద్రబాబుకు తప్పుడు సలహాలు ఇచ్చి, పార్టీని ఈ దుస్థితికి తీసుకువచ్చారని, ముందు మీ పార్టీలో సమీక్ష  చేసుకోండని సలహా ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ కుటుంబాన్ని తరచూ విమర్శిస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *