హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ అంశం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు టీ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతుంది. సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సేలు షబ్బీర్ అలీ, ఆమోస్, యాదవరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశానికి ప్రారంభం ముందే ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే నర్సారెడ్డి వెళ్లిపోయారు.




