Tuesday, 3 November 2026

టూ వీలర్‌పై ఏకంగా 117 చలాన్లుఎట్టకేలకు పట్టుబడ్డ ఓనర్‌

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): ట్రాఫిక్‌ రూల్స్‌ సరిగ్గా పాటించకపోతే పోలీసులు చలాన్లు వేస్తుంటారు. అయితే వాటిని అవార్డులు అని అనుకున్నాడో ఏమోగానీ ఓ వ్యక్తి రూల్స్‌ పాటించకుండా 117 చలాన్లు పెండిరగ్‌ లో ఉంచాడు. నాంపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు.మహ్మద్‌ ఫరీద్‌ ఖాన్‌ పేరుతో ఉన్న ఏపీ09 ఏయూ 1727 నెంబర్‌ గల హోండా యాక్టివాపై ఉన్న చలాన్లు చూసి పోలీసులే షాకయ్యారు. రూ.3 లక్షల వరకు జరిమానాలు ఉన్నాయి. చలాన్లు కట్టకుండా తిరుగుతున్న అతడ్ని అదుపులోకి తీసుకుని.. వాహనాన్ని సీజ్‌ చేశారు. ఈ బైక్‌పై 2015 నుంచి చలాన్లు పెండిరగ్‌ లో ఉన్నాయి. ఏ ఒక్క ఫోటోలోనూ హెల్మెట్‌ లేదు. పైగా కరోనా పీక్స్‌ టైమ్‌ లో కూడా మనోడు మాస్క్‌ లేకుండానే తిరిగాడు.