Friday, 6 November 2026

టెస్ట్‌ రిటైర్మంట్‌పై వార్తలను తోసి పుచ్చిన కెవిన్‌ పీటర్స్‌న్‌

ప్రసుత్తం దక్షిణప్రికాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌ అనంతరం రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు వసున్న వార్తలను ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కెవిన్‌ పీటర్స్‌న్‌ తోసిపుచ్చునూ లేదు సమర్థించనూ లేదు.దీంతో ఆయన రిటైర్మంట్‌పై గందరగోళ పరిస్థితి నెలకోంది. ప్రసుత్తం జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాఛ్‌ తన ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌ కావోచ్చు .కాగా సౌతాప్రికాతో హెడింగ్లేలో జరిగిన రెండో టెస్ట్‌లో పీటర్సన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి 149 పరుగులతో పాటుగా ప్రత్యర్ధి జట్టుపై 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ జట్టుకి విజయాన్ని అందించి పెట్టిన విషయం తెల్సిందే. ఈ టెస్టులో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే తన రిటైర్మంట్‌ వస్తున్న వార్తలను ఆయన స్పందిస్తూ .. తాను ఆడబోయే తర్వాత టెస్ట్‌ నా ఆఖరిది కావచ్చు…కాకపోవచ్చుంటూ అందరిని అయోమయస్థితిలోకి నేట్టేశాడు. పీటర్సన్‌ ఇప్పటికీ వన్డేల నుంచి వైదొలగిన విషయం తెల్సిందే. ఐతే తను టెస్టలకు దూరమనడానికి ఇపుడు సుముఖంగా లేనని ఇంకా ఎన్నొ ఇంగ్లాండ్‌ జట్టు విజయాలలో తానూ బాగస్వామి కావాలని అందుకే రిటైర్మెంట్‌ ప్రకటించ లేదని అపుడు ప్రకటించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *