టేకులపల్లి లో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
టేకులపల్లి ,సెప్టెంబర్ 17( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను శనివారం మండల పార్టీ కార్యాలయంలో బిజెపి మండల అధ్యక్షులు ధారావత్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో కెట్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని అన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రపంచంలో ఏ దేశం కూడా ఉచితంగా ఇవ్వలేదు, కానీ మన ప్రధానమంత్రి మోడీ పేద ప్రజల కోసం ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం రెండు డోసులు తర్వాత కూడా మూడో డోసులు ఉచితంగా ఇవ్వడం జరిగింది అని అన్నారు. చిత్తశుద్ధితో నిజాయితీగా అన్ని వర్గాల పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి పల్లెకు చేరుకునే విధంగా ప్రవేశపెట్టి అమలుపరుస్తున్న మోడీ గొప్ప ప్రధానమంత్రి అని అన్నారు. మోడీ పాలనలో ప్రపంచ దేశాల లో ఎంతో ఖ్యాతిని పెంపొందించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఉపాధ్యాయ జిల్లా కన్వీనర్ వాంకుడోత్ హాతిరాం నాయక్, జిల్లా యువ మోర్చ ఉపాధ్యక్షులు పునెం సూరి,మండల యువ మోర్చ అధ్యక్షులు భూక్యా అజయ్ నాయక్,సురేష్ నాయక్,వినోద్ నాయక్,సీనియర్ నాయకులు చిక్క వెంకటేశ్వరరావు,మంగ్త్య నాయక్ పాల్గొన్నారు.