Wednesday, 4 November 2026

ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి

అశ్వరావుపేట,అక్టోబర్ 12( జనం సాక్షి) అశ్వరావుపేట మండలంలోని వినాయకపురం గ్రామంలో బుధవారం టాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వినాయకపురం కు చెందిన మక్కిల నాగరాజు( 22) వ్యవసాయ పనులు కోసం ట్రాక్టర్ తో పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో ట్రాక్టర్ బురదలో దిగబడింది. ప్రమాదవశాత్తు ఇంజన్ పైకి లెగిసి పోవటంతో నాగరాజు తల ట్రక్కు తగిలింది. దీంతో బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించగా తలకు రక్తస్రావం కావడంతో మృతి చెందాడు.