డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వినతి
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూలై 24. (జనంసాక్షి). అర్హులైన ట్రాన్స్ జెండర్ లకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఖిమ్య నాయక్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్స్ నాయకురాలు జమున మాట్లాడుతూ అర్హులైన ట్రాన్స్ జెండర్లకు ఆరోగ్య శ్రీ తో పాటు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని ఉపాధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని అదనపు కలెక్టర్ కు ఇచ్చిన వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో సఖి సెంటర్ నుంచి రోజా, సంక్షేమ అధికారి తో పాటు ట్రాన్స్ జెండర్స్ ఉమా, లత,శ్రీజ,అమల తదితరులు పాల్గొన్నారు