డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో నాసిరకం..
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు
– కాంగ్రెస్ మండల అధ్యక్షులు వీరుపాక శ్రీనివాస్ రెడ్డి
కొండపాక (జనంసాక్షి) సెప్టెంబర్ 19 : డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో నాసిరకం పనులు చేపట్టారని కాంగ్రెస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షులు వీరుపాక శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సోమవారం కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వీరుపాక శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పేరుకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని, కాంట్రాక్టర్, ప్రభుత్వం నిర్లక్ష్యంతో నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడంతో పునాదులు తీయకుండానే ఇండ్లు నిర్మాణం చేపట్టడం కారణంగా కొద్ది రోజులకే పర్రెలు పట్టడం ప్రభుత్వం అసమర్థత పాలనకు నిదర్శనమని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు కల్పించిన తర్వాతనే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అంకిరెడ్డిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపళ్లి అంజయ్య గౌడ్, నాయకులు దేవదానం, లక్ష్మణ్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.