– ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
దుబ్బాక /రాయపోల్ ,మే 24(జనంసాక్షి)మండల పరిధిలోని అనాజీపూర్ గ్రామంలో రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటి చైర్మన్ ,ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గురువారం రోజున డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా అయన మాట్లడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టీన రెండుపడకల గదుల ఇండ్లను ప్రతి గ్రామంలోని ఇండ్లులేని నిరుపేదలకు నిర్మించి ఇస్తామన్నారు.మన కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశ పేట్టడం జరిగిందన్నారు.రైతులకు రైతు బంధు పథకం ద్వారా ఇచ్చే ఏకరానికి పంటకు నాలుగువేల చొప్పున సంవత్సారానికి రెండు పంటాలకు 8వేల రూపాయాలు చేల్లించే ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అన్నారు. యావత్ దేశ ప్రజలు మన రాష్ట్రం వైపు చుస్తున్నారన్నారు.అతి పిన్న వయస్సు గల మన తెలంగాణ రాష్ట్రం కనివిని ఎరగని తరహలో సంక్షేమ పథకాలు ప్రవేశ పేడుతూ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలుస్తుదన్నారు.అయన వెంటా టిఆర్ యస్ వి మండల యూత్ ప్రెసిడెంట్ భార్గవ్ ,మండల టిఆర్ యస్ నాయకులు సాయిరామ్,గురు ప్రసాద్ ,రాష్ట్ర టిఆర్ యస్ నాయకులు ప్రసాద్ ,గ్రామ టిఆర్ యస్ నాయకులు సారా సత్య నారాయణ ,మండల సీనియర్ నాయకుడు వెంకట్ గౌడ్,గ్రామ వార్డు సభ్యులు రాచకొండ యాదగిరి ,ఇస్తారి తదితరులున్నారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన




