Thursday, 5 November 2026

పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై అవగాహన సమావేశము 

తుర్కపల్లి  మే 24 (జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు తుర్కపల్లి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో 5వ సాధారణ గ్రామ పంచాయతీ సర్పంచ్, మరియు వార్డు సభ్యుల ఎన్నికల 2018 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు గురువారం అవగాహన సమావేశాన్ని యంపీడిఓ  జలెంధర్ రెడ్డి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డమీది సత్యనారాయణ, టిడిపి పార్టీ అధ్యక్షుడు శ్రీరామ్ మూర్తి,బిజెపి పార్టీ అధ్యక్షుడు చత్రు నాయక్, టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి జక్కుల వెంకటేశ్,ఈ ఓపిఆర్డీ చంద్రమౌళి ,అబీబ్ , గ్రామ కార్యదర్శిలు శ్రీనివాస్,చారి,రమణ రెడ్డి పాల్గొన్నారు.