డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి

కొండపాక (జనంసాక్షి) సెప్టెంబర్ 20: రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు  సిద్దిపేట జిల్లాలోపర్యటన లో భాగంగా మంగళవారం కొండపాక మండల కేంద్రంలో 5కోట్ల 84లక్షల రూపాయలతో నిర్మించిన 93 డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్,జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణశర్మ, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఎఫ్డీసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి,జిల్లా గ్రంధాలయ చేర్మెన్ లక్కీరెడ్డి ప్రభాకర్ రెడ్డి,సర్పంచ్ చిట్టీ మాధురి,ప్రజాప్రతినిధులు, మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.