డబుల్ బెడ్ రూమ్ లను సందర్శించిన జగిత్యాల బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్ రవీందర్ రెడ్డి
సారంగపూర్ (జనంసాక్షి ) 21 అక్టోబర్
సారంగాపూర్ మండలం లో పోతారం గ్రామం గణేష్ పల్లి లోనీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించిన జగిత్యాల బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా ముదుగంటి రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ 6 సంవత్సరాలైనా ఇండ్ల నిర్మాణం నత్తనడకలుగానే కొనసాగుతుంది అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు అయినప్పటికీ అర్హులైన వారికి ఇంకా మంజూరు చేయలేదన్నారు, నాణ్యత లోపంగా ఇండ్లను నిర్మిస్తున్నారు. వర్షాల కారణంగా ఇంటిలోకి నీరు వచ్చేలా రోడ్డు దిగువన ఇండ్లను నిర్మించారు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్కొక్క ఊరికి కనీసం 20 ఇండ్లను కూడా ఇవ్వలేదన్నారు, స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు,ఈ మధ్యలో కురిసిన వర్షాలకు చాలా ఇండ్లు కూలిపోయాయి అన్నారు
వాటికి ఇప్పటికీ నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు అని అన్నారు
రవీందర్ రెడ్డి గారి వెంట సారంగాపూర్ మండల బీజేపీ నాయకులు పాలగన్ని మల్లేష్, అల్లేపు చిరంజీవి, పోగుల శ్రీనివాస్, బసా నాగేంద్ర, కుర్మచలం సతీష్, తదితరులున్నారు.