Wednesday, 4 November 2026

డబ్బులు ఇవ్వలేక.. వైద్యం చేయించుకోలేక..

కూతురును రైలుకిందకు తోసి తండ్రి ఆత్మహత్య
మహబూబ్‌నగర్: వైద్యసిబ్బందికి డబ్బులు ఇవ్వలేక.. భార్యకు వైద్యం చేయించుకోలేక మనస్తాపానికి గురై ఓ తండ్రి కూతురుతో కలిసి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం వీరన్నపేట రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం, మృతుని సూసైడ్‌నోట్ ఆధారంగా.. జడ్చర్లకు చెందిన నాగలక్ష్మి రెండోకాన్పు కోసం తన భర్త చెన్నకేశవులు(35)తో కలిసి సోమవారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. మరుసటి రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో సిబ్బంది నాగలక్ష్మికి వైద్యచికిత్సలు అందించేందుకు డబ్బులు డిమాండ్‌చేశారు. రోజూఅడిగిన డబ్బులు ఇచ్చారు. ఈ క్రమంలో గురువారం మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సిబ్బంది తీరుపై ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ శ్యామూల్‌కు ఫిర్యాదుచేశారు. సిబ్బంది డబ్బులకు వేధిస్తున్నారని, ఇవ్వకుంటే సరైన వైద్యం అందించడం లేదని మానసికక్షోభకు గురయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెన్నకేశవులు లేఖ రాసి జేబులో పెట్టుకుని కూతురు హర్షితతో కలిసి వీరన్నపేట సమీపంలో రైలుకిందపడి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న మృతుని భార్య నాగలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది.రైల్వేపోలీసులు మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్ తెలిపారు.
 బాధ్యులపై చర్యలు
ఆస్పత్రిలో రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటాం. వైద్యసిబ్బంది డబ్బులు అడుగడంతో మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన చెన్నకేశవులు రాసి ఉన్న సూసైడ్‌నోట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబానికి ఆదుకునేందుకు కలెక్టర్‌తో మాట్లాడుతా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *