నిజామాబాద్ క్రైం : జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి సోమవారం 27 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ సబ్ డివిజన్ల పరిధిలో నుంచి ప్రజలు తమ సమస్యలను ఎస్పీ ఎస్ చంద్రశేఖర్‌రెడ్డికి ఫోన్ ద్వారా వివరించారు.
ఈ ఫిర్యాదు ల పట్ల ఎస్పీ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌బీ సీఐ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.




