Thursday, 5 November 2026

డిండి ఎత్తిపోతల ముంపు భాదితుల సమస్యలకు పరిష్కారం

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి నాంపల్లి. జనం సాక్షి ,ఆగస్ట్ 26. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిండి ఎత్తిపోతల పథకం ముపు బాధితుల సమస్యలను నేటి నుండి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు.కిష్ట రాయిన్ పల్లి జలాశయం లో ముంపుకు గురవుతున్న నాంపల్లి మండలం లక్ష్మణా పురం గ్రామ భూనిర్వాసితులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. భారీ వర్షంలోనూ తడుస్తూ ముంపు బాధితుల సమస్యలు ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఆర్డీవోలు, తహసిల్దార్లు అందించిన సమాచారం మేరకు నిర్వాసిత గ్రామాల ప్రజలకు పరిహారం అందజేశామన్నారు. భూ నిర్వాసితులు మాట్లాడుతూ 2016 లో నిర్వహించిన నివాస గృహాల సర్వేలో చాలామంది కుటుంబాలను గుర్తించలేదని, కొందరికి ఇళ్ళ నిర్మాణ స్థలాలకు సైతం వ్యవసాయ భూమి తరహా పరిహారం ఇచ్చారని ఆవేదన తెలిపారు. ఇప్పటివరకు 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరిని కుటుంబముగా పరిగణించి పునరావాస ప్యాకేజీకి అర్హులుగా గుర్తించాలన్నారు.అర్&అర్ ప్యాకేజీని 20 లక్షల రూ.లు కు పెంచి, ఉపాధికి అనువుగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో పునరావాసం కల్పించాలని వారు కోరారు. నిర్వాసితుల సమస్యలపై స్పందించిన కలెక్టర్ ప్రతినిర్వాసిత కుటుంబం నేరుగా సమస్యలు వివరించేలా తహశీల్దార్ ప్రత్యేకంగా రూపొందించిన దరఖాస్తులను గ్రామస్తులకు అందజేశారు. దరఖాస్తులో పేర్కొన్న విధంగా లక్ష్మణాపురం గ్రామంలోని సమస్యలు నేటి నుండే పరిష్కరిస్తానని, 20 లక్షల పునరావాస పరిహారం పెంపు, రంగారెడ్డి జిల్లాలో ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రభుత్వానికి నివేదిస్తనని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, నీటిపారుదల శాఖ ఈ ఈ ఎలమందయ్య, తహసిల్దార్ లాల్ బహదూర్, ఎంపీడీవో శేషు కుమార్, డీఈలు జాను నాయక్ ,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు