హైదరాబాద్,జూలై11(జనం సాక్షి): డీఎస్‌ను కాంగ్రెస్‌లోకి రానివ్వొద్దని తాను అనలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. డీఎస్‌ను చేర్చుకోవాలో… వద్దో పీసీసీ కమిటీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. బాలాపూర్ దేవతల గుట్టల్లో వందల ఎకరాల భూమి కబ్జాకు గురవుతోందన్నారు. గురువారందేవతల గుట్టకు వెళ్లి భూములను పరిశీలిస్తానని చెప్పారు. కబ్జాదారుల వెనుక ఎవరున్నారో సర్కార్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కబ్జాలపై కఠిన చర్యలు ఉంటాయన్న కేటీఆర్‌కు ఇది కన్పించడంలేదా? అని నిలదీశారు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి సిగ్గురావడంలేదని వీహెచ్ ధ్వజమెత్తారు.




